Wednesday, 8 May 2019

May 7 Day

Day of May 7th in calendar 
About Ravindra Nath Tagore : విశ్వకవి రవీంద్రుని జయంతి...
మన దేశానికి తొలి నోబెల్ పురస్కారాన్ని అందించిన మహనీయుడు రవీంద్రనాధ్ టాగూర్. "గీతాంజలి" కావ్యానికిగాను టాగూర్ కు ఈ సాహితీ పురస్కారం లభించింది. భారతీయ సాహితీతేజాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అయినందువల్లనే ఆయన విశ్వకవిగా ప్రసిద్ధులయ్యారు.

ఆయన రచించిన "జనగణమన" గీతాన్ని జాతీయ గీతంగా చేసుకుని  ప్రతినిత్యం ఆలాపనచేస్తూ, భారత జాతిజాతంతా ఆయన్ను  స్మరిస్తుంది.       

 ఆయన అత్యుత్తమ మానవజీవిత సంగ్రహంగా "గీతాంజలి" నిత్యం ప్రపంచంలో ఏదో మూల నినదిస్తూనే ఉంది. ఆయన కుసుమార్ధ్రభావాల ఆవిష్కారంగా "శాంతినికేతన్" పరిమళిస్తూంటుంది.   ఈ విశ్వకవి కి  ఘన నివాళి...

Alluri Sitarama Raju :  విప్లవ సింహం అల్లూరి సీతారామరాజు వర్ధంతి
                   అల్లూరి సీతారామరాజుఒక మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు          అల్లూరి.      1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును  హాజరు పరిచారు  బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమర వీరుడయ్యాడు. ఆయన కలిగించిన స్ఫూర్తి అజరామరమరయింది.


Atreya : మనసు కవి "ఆచార్య ఆత్రేయ" గారి జయంతి

 వేదాంతం, తర్కం, మనసు నిలువెత్తు మనిషిగా సాక్షాత్కరిస్తే .. ఆయనే ఆత్రేయ.
    అందరూ రాసినట్టు గా ఆయన మాటల్ని కలంతో కాకుండా...... హృదయంతో రాస్తాడు. మనసు లోతుల్ని అన్వేషించి................. బావోద్వేగాల్ని వెలికితీస్తాడు. అందుకే ఆయన రాసిన సంభాషణలు .......... ... ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. సందర్భమేదైనా సరే .. సన్నివేశం ఎలాంటిదైనా సరే ఆత్రేయ కలం పడితే చాలు... మాటలు ఉద్వేగపు ఊటలూరి  ... జన హ్రుదయాల్ని ఆర్ధ్రంగా తట్టి... అంచనాలకు అందని అనుభూతుల తీరాలకు తీసుకొని వెళతాయి. అందుకే ఆయన రాసిన మాటలు తెలుగు తెరపై వేదాలు గా భాసిల్లుతున్నాయి.

ఆత్రేయ గారి అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. 1921, మే 7 న సూళ్లూరుపేటలోని మంగళం పాడులో జన్మించారు. 1950లో విడుదలైన 'దీక్ష' చిత్రంలో ఆయన గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సంభాషణల రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. ఇంద్రధనుస్సు రంగుల హంగులను ప్రేక్షకులకు అందించి, ఆనందభరితులను చేశారు..

ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, శృంగార భావములుగల అర్థాలున్నాయి. సినిమా పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.

ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. "వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి" అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది.

 ఆత్రేయ రాయడం లేట్ చేసినా... ఎంతో మంది దర్శకులకు తమ సన్నివేశాలు పండాలంటే ఆయనే ఉండాలని ఫీలయ్యేవారు. అందుకే ఆత్రేయ జాప్యాన్ని హృదయ పూర్వకంగానే భరించే దర్శకనిర్మాతలు చాలా మంది ఉండేవారు. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, కె.యస్ .ప్రకాశరావు . వీరిద్దరికీ ఆత్రేయ దాదాపు అన్ని చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు అందించారు. ఆత్రేయ 1400కి పైగా సినిమా పాటలు రాశారు. వాటిల్లో 100కి పైగా మనసు పాటలే ఉన్నాయి. మనసు అనే ముడి పదార్ధంతో ఆత్రేయ రాసినన్ని పాటలు ఏ ఇతర కవీ రాయలేదు. మౌనం మనసు భాష అంటూ మొదలుపెట్టి... ''మనిషికి మనసే తీరని శిక్ష.. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష.'' అంటూ మాట్లాడి... మనసొక మధుకలశం..అంటూ ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు ఆత్రేయ.

    ఆత్రేయుడు అంటే చంద్రుడు.  వెన్నెలంత చల్లగా తెలుగుజాతికి మనసైన పాటలందించిన మనసు కవి, మరిచిపోలేని మాటలందించిన మనసున్న కవి. తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఆయన ఓ చెరిగిపోని తీపి గుర్తు. అరుదైన అక్షరయోగి, మాటల మహర్షి ఆచార్య ఆత్రేయ. ....
మహోన్నతులు ముగ్గురకు ఘన నివాళులు.

No comments:

Post a Comment

TS SSC Result 2019

TS SSC Results 2019  Telangana Board Releasing 10th Result at bse.telangana.gov.in. by 11:30am, which can be checked either online or by SM...